Takkellapadu, Andhra Pradesh 522438, India

డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి
తాడికొండ నియోజకవర్గం MLA

శ్రీమతి మేరువ విజయలక్ష్మి
గ్రామ సర్పంచ్

వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్

Breaking News

మరపురాని మహానేత 10వ వర్ధంతి నివాళి

                             మరపురాని మహానేతకు 10వ వర్ధంతి నివాళి
        10th death anniversary tribute to an unforgettable great leader YSR



వైస్సార్ కాంక్ష  విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిధిగా  మన నియోజకవర్గ ఎమ్మెల్యే  ఉండవల్లి శ్రీదేవి గారు పాల్గొన్నారు, గ్రామ ప్రజలు ఆమెకు బరి ఎత్తులో స్వాగతం పలికారు, జోహార్ వైస్సార్ అంటూ  ప్రాంగణం మారుమోగిపోయింది
,బరి ఎత్తున  అభిమానులు మరియు పార్టీ కార్యకర్తలు  ఉదేశించి
 ఎమ్మెల్యే  మాట్లాడుతూ వైస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గురించి ప్రసంగమించారు , అనంతరం  అన్నదాన కార్యక్రమంలో  పాల్గొనన్నారు.

 మనసుంటే మార్గముంటుంది. రాజన్న ప్రవేశపెట్టిన పథకాలు సాహసోపేతమైనవి. స్వచ్ఛమైన, నిష్కల్మషమైన మనసు.. ప్రతి పేదవాడికి లబ్ధిజరగాలన్న లక్ష్యం.. ఉండబెట్టే అసాధ్యాలు సుసాధ్యాలయ్యాయి. 
ప్రజల హితం కోరేవాడు జననేత అవుతాడు. మహానేతగా నీరాజనాలు అందుకుంటాడు. జనం గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాడు.
అలాంటి నాయకుడే వైఎస్‌ రాజశేఖర రెడ్డి. జనం గుండెల్లో ఆయనది చెరగని స్థానం.







జనం గుండెల్లో ఆయనది చెరగని స్థానం.
 రాజన్న అంటే ఒక ఆత్మీయ పలకరింపు. అంతకుమించి ఓ పెద్ద దిక్కు. అలాంటి మహానేత అభిమానులు, పార్టీ కార్యకర్తలను తీరని శోకంలో ముంచుతూ తిరిగిరాని లోకాలకు తరలిపోయి ఎనిమిదేళ్లు గడిచిపోయాయి.  (సెప్టెంబర్ 2) ఆయన 10వ  వర్ధంతి.
ఈ నేపథ్యంలో ఆ మహానేతకు నివాళి
బడుగు ఇంటి తలుపు తడితే గూడునిచ్చిన (ఇందిరమ్మ ఇళ్లు) జననేతను గుర్తు చేసుకుంటూ కంటతడి పెడుతుంది. పింఛనుతో ఆకలి తీర్చుకుంటున్న పండుటాకు ప్రతి అన్నం మెతుకులోనూ రాజన్ననే చూసుకుంటుంది. ఫీజు రాయితీతో ఎదిగిన ప్రతి సరస్వతీ పుత్రుడు నీ రుణం తీర్చుకోలేమంటూ చేతులు జోడిస్తాడు కృత‌జ్ఞ‌తతో. ఇక ఆరోగ్యశ్రీతో పునర్జన్మ పొందిన నిరుపేదలైతే ఆ ఆత్మీయ నేతను నిత్యం దేవుడిలా కొలుస్తారు. వైఎస్సార్ పాలనను తలచుకుంటే మచ్చుకు గుర్తుకొచ్చే కొన్ని అంశాలే ఇవి.
జనం కష్టసుఖాలను తెలుసుకునేందుకు ప్రజాప్రస్థానం పాదయాత్ర సాగించినప్పుడే రైతుల కష్టాలను చూసి చలించిపోయారు వైఎస్. అన్నదాతల కడగళ్లు తుడవడానికి సాగునీటి కోసం జలయజ్ఞం ప్రారంభించారు. అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను అండగా నిలిచారు.
 







సంక్షేమ పథకాలు అంటే గుర్తుకొచ్చేది ఆయన. బడుగు బలహీన వర్గాలకు గూడునిచ్చి (ఇందిరమ్మ ఇళ్లు), ఫించనుతో వారికి ఆకలి తీర్చాడు. ఆరోగ్యశ్రీతో ఎందరికో పునర్జమ్మ అందించాడు. ప్రజల హితం కోరిన వైఎస్ రాజశేఖరరెడ్డి మహానేత అయ్యారు.
చెదరని చిరునవ్వుతో ప్రతి పేదవాడిని పలకరించే రాజన్న.. కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలను శోక సంద్రంలో ముంచుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి తొమ్మిదేళ్లు గడిచిపోయాయి. నేడు (సెప్టెంబర్ 2) దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పదవ వర్ధంతి.

తాను ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడానికి ఎంతో నిజాయతీగా, నిబద్ధతతో కృషి చేసిన వ్యక్తి వైఎస్సార్. పేద ప్రజలకు కార్పోరేట్ వైద్యం కల అనుకుంటే.. దాన్ని సైతం ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి వారి కలను నిజం చేశారు.
ఉన్నత చదువులు కొనలేమని భావించిన సరస్వతీ పుత్రులకు ఫీజు రీయింబర్స్ మెంట్ వరం కల్పించిన ఘనుడు వైఎస్సార్. నిరుపేద ముస్లిం యువతకు విద్యా ఉద్యోగావకాశాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం. 






 పండుటాకులకు పింఛను ఇచ్చి వారి ఆకలి తీర్చారు. తినే అన్నం మెతుకుల్లో, ఆయన కట్టించిన ఇందిరమ్మ ఇళ్లలోనూ, తమకు పునర్జన్మ ప్రసాదించిన రాజశేఖరుడిని తలుచుకుని నేటికీ కన్నీళ్లు పెడుతున్నారు.
జనం కష్టసుఖాలను తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో రైతుల కష్టాలు చూసి చలించిపోయారు. 














  


దేశానికి వెన్నెముక వ్యవసాయమేనని బలంగా విశ్వసించి సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతూ జలయజ్ఞం ఆరంభించారు.
ఆత్మహత్య చేసుకున్న రైతులకు అండగా నిలిచారు. రైతు రుణాలు మాఫీ చేసి లక్షల రైతు కుటుంబాల్లో వెలుగులు నింపారు. పాదయాత్ర అనంతరం జరిగిన ఎన్నికల్లో విజయం సాదధించి 2004 మే నెలలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్సార్..
 రూ.2కే కిలో బియ్యం, రైతులకు ఉచిత విద్యుత్, 108 (అంబులెన్స్ సర్వీసులు), ట్రిపుల్‌ ఐటీల ఏర్పాటు సహా ఎన్నో ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

No comments