సంక్రాంతి సంబరాలు 2K18
సంక్రాంతి సంబరాలు 2018
Sankranthi Celebrations 2k18 #Takkellapadu Official
Sankranthi Celebrations 2k18 #Takkellapadu Official
![]() | ||||||
ముగ్గులు
రాళ్ళూ రప్పలూ లేకుండా ఒక పద్ధతిలో అలకబడిన నేల, మేఘాలు లేనిఆకాశానికి సంకేతం. ఒక పద్ధతిలో పెట్టబడు చుక్కలు రాత్రి వేళ కనిపించేనక్షత్రాలకు సంకేతం. చుక్కలచుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్ళలోఇమిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పడికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం.ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్యు స్థానానికిసంకేతం. ఇంకొక దృక్పథంలో గీతలు స్థితశక్తికి (స్టాటిక్ ఫోర్స్),చుక్కలుగతిశక్తి (డైనమిక్ ఫోర్స్)కు సంకేతాలని, మరియు ముగ్గులు శ్రీ చక్ర సమర్పనాప్రతీకలని శక్తి తత్త్వవేత్తలు అంటారు. ఇక వివిధ ఆకారాలతో వేయుముగ్గులు విల్లు ఆకారం పునర్వసు నక్షత్రానికీ, పుష్పం పుష్యమీ నక్షత్రానికీపాము ఆకారము ఆశ్లేష కూ, మేక, ఎద్దు, పీత, సింహం, ఇలాంటివి మేష,వృషభ, మిధున, కర్కాటక రాసులకూ, తొమ్మిది గడుల ముగ్గు నవగ్రహాలుకూసంకేతాలుగా చెప్పచ్చు.
రధం ముగ్గు
గుంటూరులో సంక్రాంతిని గుర్తుతెచ్చే ముగ్గు
మూడు రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే పండుగనుఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రధం ముగ్గు. అందరూ ఒకరికి ఒకరుతోడుంటూ కలసి సహజీవనం సాగించాలి అనే సంకేతాలతో ఒక రథం ముగ్గుతాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ పోతూంటారు.
గొబ్బెమ్మలు
పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవుపేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్ళైన గోపికలకు సంకేతం. ఈముద్దల తలమీద కనుపించే రంగుల పూలరేకులు, పసుపు కుంకుమలు ఆగోపికలందరూ భర్తలు జీవించియున్న పునిస్త్రీలకు సంకేతం. ఆ గోపికా స్త్రీలరూపాలకు సంకేతమే గోపీ+బొమ్మలు= గొబ్బెమ్మలు. మధ్య ఉండే పెద్దగొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూపాటలు పడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణ భక్తి తమకూ కలగాలనిప్రార్థిస్తుంటారు. దీనిని సందే గొబ్బెమ్మ అంటారు. గొబ్బెమ్మలు పొద్దున పూటముగ్గులో ఉంచి, దానిపై గుమ్మడి పూలుతో అలంకారం చేస్తే చాలాఅందంగా ఉంటుంది.

























































































No comments